రేపటి కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ..!

రేపటి కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ..!
రేపటి కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు చేస్తున్నారు

రేపటి కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టివేయాలని విజయశాంతి కోరారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున వేలం వేస్తున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. భూములను ప్రభుత్వం కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంక్‌ ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story