నైట్ కర్ఫ్యూతో కేసులు ఎక్కడ తగ్గాయో చెప్పాలి : తెలంగాణ హైకోర్టు

నైట్ కర్ఫ్యూతో కేసులు ఎక్కడ తగ్గాయో చెప్పాలి : తెలంగాణ హైకోర్టు
తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై హైకోర్టు ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. రెమ్‌డెసివిర్ రాష్ట్రంలో తయారవుతున్నా ఎందుకు కొరత వచ్చిందని ప్రశ్నించింది.

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై హైకోర్టు ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. రెమ్‌డెసివిర్ రాష్ట్రంలో తయారవుతున్నా ఎందుకు కొరత వచ్చిందని ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పలు అంశాలపై అసహనం వ్యక్తంచేసింది. కరోనా కంట్రోల్ కోసం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా వెల్లడించగా... నైట్ కర్ఫ్యూ వల్ల కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలని కోర్టు కోరింది. వెబ్ పోర్టల్‌లో కోవిడ్ సెంటర్ల వివరాలు ఎందుకు లేవని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నది. అయితే మూడు రోజుల్లోనే ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడిందో తెలుపాలన్నది. పగటి వేళ బహిరంగ ప్రదేశాలు, బార్లు, థియేటర్లు వద్ద ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టుప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కుంభమేళా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో పెట్టారా లేదా అని అడిగింది. తెలంగాణ సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నది. ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రించడంలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.

Tags

Read MoreRead Less
Next Story