Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు..!

Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదైన కరోనా కేసులు..!
Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌... కోరలు చాస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 44 వేల 516 పరీక్షలు చేయగా... 13 వేల 212 మందికి పాజిటివ్‌గా తేలింది.

Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌... కోరలు చాస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 44 వేల 516 పరీక్షలు చేయగా... 13 వేల 212 మందికి పాజిటివ్‌గా తేలింది. విశాఖ జిల్లాలో 2 వేల 244 పాజిటివ్ కేసులు వెల్లడి కాగా... చిత్తూరు జిల్లాలో 15 వందల 85 కేసులు, అనంతపురం జిల్లాలో 12 వందల 35 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 12 వందల 30 కేసులు, గుంటూరు జిల్లాలో వెయ్యి 54 కేసులు, నెల్లూరు జిల్లాలో వెయ్యి 51 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో ఏపీలో 2 వేల 942 మంది కరోనా నుంచి కోలుకోగా.... ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14 వేల 532కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 268 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20 లక్షల 74 వేల 600 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 64 వేల 136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక తెలంగాణలో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగానే ఉంది. ఒక్కరోజులోనే 4 వేల 416 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. అలాగే 19 వందల 20 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పంజా విసురుతోంది. సంక్రాంతి పండుగ అనంతరం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 16 వందల 70 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 29 వేల 127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల 69 మంది కరోనాతో మృతి చెందారు.

ఇక సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తున్నా 34 మంది సిబ్బందిలో ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవాలయంలో పనిచేసే ముగ్గురు అర్చకులు, మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో వారు ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నారు. అధికారుల సూచన మేరకు ఆలయంలో ప్రతిరోజూ హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్టింగ్ కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలతో టెస్టింగ్ కేంద్రాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై బల్దియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. రద్దీ ప్రాంతాల్లో స్ప్రేయింగ్ కోసం 100కు పైగా శానిటేషన్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story