Hyderabad Metro Timings: ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటనే మెట్రో టైమింగ్స్‌లో మార్పులు..

Hyderabad Metro Timings: ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్.. వెంటనే మెట్రో టైమింగ్స్‌లో మార్పులు..
Hyderabad Metro Timings: ఒక రాష్ట్రానికి రాజధాని అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందాల్సిందే.

Hyderabad Metro Timings: ఒక రాష్ట్రానికి రాజధాని అంటే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందాల్సిందే. అప్పుడే ఆ రాష్ట్రానికి, ఆ రాజధానికి గౌరవం. అలాగే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత నుండి తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కూడా ఎన్నో రకాలుగా రూపాంతరం చెందింది. ఐటీ లాంటివి ఎన్నో వచ్చి హైదరాబాద్ రూపురేఖలనే మార్చేశాయి. అలా హైదరాబాద్‌లో మార్పు తీసుకొచ్చిన ఎన్నో అంశాల్లో మెట్రో కూడా ఒకటి.

మెట్రో సర్వీస్‌లు ప్రారంభయ్యాక ప్రజలకు ఒక దగ్గర నుండి మరో దగ్గరకు వెళ్లడానికి ఆప్షన్స్ పెరిగాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూర ప్రయాణం కూడా తొందరగా చేయొచ్చు అనగానే మెట్రోపై చాలామందికి పాజిటివ్ అభిప్రాయం వచ్చేసింది. అందుకే ఐటీ, ప్రైవేట్, గవర్నమెంట్.. ఇలా ఉద్యోగులు అందరు కొన్ని రోజుల తర్వాత మెట్రోపైనే ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఆ మెట్రో టైమింగ్స్ తమకు సమస్యగా మారుతున్నాయని కొందరు వాపోతున్నారు.

ఉదయం 6గంటలకు మెట్రో సేవలు ప్రారంభం కావాలని అభినవ్‌ సుదర్శి అనే ప్రయాణికుడు సోమవారం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల ఇబ్బందులను వీడియో తీసి ట్విట్టర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు. తెల్లవారుజామున నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, క్యాబ్‌లవారు అధిక దోపిడీకి పాల్పడుతున్నారని వివరించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించి, విషయాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రోరైలు ఇవాళ్టి నుంచి ఉదయం 6 గంటల నుంచే అందుబాటులోకి వచ్చింది. మొదటి రైలు ఉదయం 6గంటలకు బయలుదేరుతుందని మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. రాత్రి చివరి రైలు 10.15 గంటలకు బయలు దేరి రాత్రి 11.15 గంటలకు స్టేషన్‌కు చేరుకుంటుంది. దీంతో ఇక నుంచి ఉదయం 6 గంటలకు తొలి రైలు ప్రారంభమవుతుందని, చివరి రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story