JP Nadda : హుజురాబాద్‌,దుబ్బాక ఫలితాలతో కేసీఆర్ మతి తప్పింది : జేపీ నడ్డా

JP Nadda : హుజురాబాద్‌,దుబ్బాక ఫలితాలతో కేసీఆర్ మతి తప్పింది : జేపీ నడ్డా
JP Nadda : తెలంగాణలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన నడుస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 317 జీవో ఉద్యోగులకు వ్యతిరేకమైందన్నారు.

JP Nadda : తెలంగాణలో ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన నడుస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 317 జీవో ఉద్యోగులకు వ్యతిరేకమైందన్నారు. ఉద్యోగుల పక్షాన పోరాడడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. కరోనా పేరును టీఆర్ఎస్ సర్కార్ వాడుకుంటోందన్నారు. TRS మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీలకు కరోనా రూల్స్ వర్తించవా అని ప్రశ్నించారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్‌కు మతి తప్పిందన్నారు నడ్డా. లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఫాం హౌస్‌కు నీళ్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. సంజయ్‌ అరెస్టుకు నిరసనగా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు నడ్డా.

Tags

Read MoreRead Less
Next Story