K Kavitha: ఎమ్మెల్సీగా కవిత నామినేషన్‌కు రంగం సిద్ధం..

K Kavitha (tv5news.in)

K Kavitha (tv5news.in)

K Kavitha: మరోసారి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేయబోతున్నారు.

K Kavitha: మరోసారి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేయబోతున్నారు. కాసేపట్లో నామినేషన్‌ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు కవిత. ఈ సందర్భంగా టేక్రియాల్ దగ్గర స్థానిక నేతలు కవితకు ఘన స్వాగతం పలికారు. కవితను రాజ్యసభ ఎంపీగా పంపిస్తారని వార్తలు వచ్చినా.. తాను ఎమ్మెల్సీగా ఉండేందుకే ఇష్టపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో నిజామాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలితకు ఈసారి ఛాన్స్ ఇవ్వడం లేదు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. దాంతో అభ్యర్ధులంతా నామినేషన్లు వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story