బీజేపీపైనా కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లాల ముఖ్యనేతతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి 30 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యాలయాల నిర్మాణం సహా అనేక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరగాలని వారికి కేసీఆర్‌ సూచించారు.. దసరా నాటికి కార్యాలయాలను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పార్టీ భవన నిర్మాణ బాధ్యులకు ఒక్కో భవన నిర్మాణానికి 60 లక్షల రూపాయల చెక్కు అందజేశారు.

ఇక మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలపై నేతలు దృష్టిపెట్టాలని కేసీఆర్‌ సూచించారు.. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఇదే సమయంలో బీజేపీపైనా కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు.

సభ్యత్వ నమోదుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్‌.. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేసిన నేతలను అభినందించారు. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని, అలాగే గ్రామకమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత నాయకులు అధికారులతో వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పొడు భూముల వ్యవహారం సమావేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది.. పోడు భూముల వ్యవహారంలో నేతలు సమన్వయంతో వ్యవహారించాలన్నారు.. అధికారుల జోలికి వెళ్లొద్దని కేసీఆర్‌ నేతలను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story