KCR: బీజేపీని గద్దె దించాలంటున్న సీఎం కేసీఆర్.. కొత్త ఎత్తులతో..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: గడిచిన అయిదారు నెలలుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజీపీ ఫైట్ నడుస్తుంది.

KCR: గడిచిన అయిదారు నెలలుగా టీఆర్ఎస్ వర్సెస్ బీజీపీ ఫైట్ నడుస్తుంది. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీని గద్దె దించాలని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయటంతో.. గులాబీ బాస్ సరికొత్త ఎత్తులకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ.

కేంద్ర నిర్ణయాలతో దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎజెండా ను తీసుకొని బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే గత డిసెంబర్ లో తమిళనాడు వెళ్లి వచ్చిన కేసీఆర్.. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు సీపీఎం పార్టీ కీలక కేంద్ర పెద్దలతో సీఎం కేసీఆర్ ఆర్ రెడ్డి భవన్ లో లంచ్ మీటింగ్ జరిగింది.

సీపీఎం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్‌కు వచ్చిన నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దింపడమే తమ లక్ష్యం అని రాష్టాని కి వచ్చిన బీజేపి కేంద్ర పెద్దలు వార్నింగ్ లు ఇస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేరళ సీఎం పినరయి విజయ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో పలువురు బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలను, రీజనల్‌ పార్టీల అధినేతల కలువనున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై విరుచుకుప‌డుతున్న టీఆర్ఎస్.. జాతీయస్థాయిలో బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత‌ను అనుకూలంగా మాలుచుకోవాలనుకుంటోంది.

త్వరలోనే ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో జ‌ట్టుక‌ట్టేందుకు గులాబి ద‌ళ‌ప‌తి సిధ్దమ‌వుతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏదో ఆషామాషీగా వ్యవహారంగా కాకుండా..పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వైపుగా అడుగులు వేస్తూ ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు.

ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ శక్తులను ఏకం చేయాలని కంకణం కట్టుకున్నారు. రెండున్నరేళ్లలో ఒక్కో అడుగు వేసుకుంటూ ఢిల్లీ పీఠం నుంచి బీజేపీకి దింపేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ అగ్ర నాయకుల నుంచి చోటా లీడర్స్ వరకు తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీల అధినేతలతో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.

2018లో కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలను కలిసి ఆనాటి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ ప్రయత్నాలు చేసినా కూడా వర్కువుట్‌ కాలేదు. ఇటీవల తమిళనాడు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాలిన్ తో 45 నిమిషాల పాటు భేటీ కావడం.. ఇప్పుడు కేరళ సీఎం ను లంచ్ కి ఆహ్వానించడం .. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడం కొత్త కూటమి కి సంకేతాలు.

ఇక త్వరలోనే మరో ఒకటి, రెండు రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి లోపు దాదాపు 5 నుండి 8 రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు సాగిస్తారని చర్చ. గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. లేటెస్టుగా బీజేపీకిపై పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని కలిసివచ్చే శక్తులతో బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు.

గత వైఫల్యాల నుంచి పాఠాలతో సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా ఎదగాలన్న టీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story