ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ
విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావడం కష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ప్రస్తుతానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. ఆయనకు 12 వేల 142 ఓట్ల మెజారిటీ వచ్చింది. మిగతా రౌండ్లలోనూ ఇదే స్థాయిలో ట్రెండ్ కొనసాగినా ఆయన విజయం సాధించేందుకు అవసరమైన 50 శాతం ఓట్లు రావడం కష్టంగా కనిపిస్తోంది. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 3 రౌండ్లలో కలిపి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 49 వేల 380 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 37వేల 238 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ నిలిచారు. 3 రౌండ్లలో కలిపి ఆయనకు 30 వేల 427 ఓట్లు వచ్చాయి.

ఓట్ల శాతంలో చూస్తే ఇప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 31 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో మల్లన్న ఉన్నారు. మల్లన్నకు 24 శాతం ఓట్లు వచ్చాయి. ఇక కోదండరామ్‌ 20 శాతం ఓట్లు సాధించారు. ఐతే.. విజయానికి అవసరమైన 50 శాతం ఓట్లు సాధించాలంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరం ఉంది. అంటే.. తుది ఫలితం తేలడానికి ఇవాళ రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉంది.


Tags

Read MoreRead Less
Next Story