కొండపోచమ్మ కెనాల్ నుంచి రేపు కూడవెల్లి వాగులోకి నీటి విడుదల

కొండపోచమ్మ కెనాల్ నుంచి రేపు కూడవెల్లి వాగులోకి నీటి విడుదల
క్షేత్రస్థాయిలో పర్యటించిన హరీష్ కొండపోచమ్మ సాగర్ కెనాల్ వద్ద నుంచే ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు.

కొండపోచమ్మ కెనాల్ నుంచి రేపు కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు విడుదల చేయనున్నారు. గజ్వేల్ మండలంలోని బూరుగుపల్లి, సింగాటం, అందిపూర్‌ గ్రామాల్లో వరి సాగుచేసిన రైతులు.. పంట ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్‌ను కలిసారు. దీంతో.. క్షేత్రస్థాయిలో పర్యటించిన హరీష్ కొండపోచమ్మ సాగర్ కెనాల్ వద్ద నుంచే ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. పంటల పరిస్థితి వివరించారు. తక్షణం సాగునీరు విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి వెంటనే స్పందించిన CM కేసీఆర్ రేపే నీటి విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

CM కేసీఆర్‌కి ఫోన్‌లోనే పరిస్థితి వివరించి నీటి విడుదలపై చర్చించిన హరీష్‌రావు.. అధికారులతోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. అవసరమైన కాల్వ తవ్వకం పూర్తి చేసి రేపు ఉదయానికల్లా నీళ్లిస్తామన్నారు. వాగులోకి నీటి విడుదలతో భూగర్భ జలాలు పెరుగుతాయని, పంటల్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని హరీష్ చెప్పారు. తెలంగాణ సాధన, KCR సీఎం కావడం వల్లే రైతుల కష్టాలు తీర్చగలిగామని అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story