KTR: ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇంటర్ యువతి.. కేటీఆర్ అభినందన..

KTR: ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఇంటర్ యువతి.. కేటీఆర్ అభినందన..
KTR: నల్గొండ జిల్లా వంగమర్తికి చెందిన సబితా ఇంటర్మీడియట్ చదువుతోంది.

KTR: నల్గొండ జిల్లా వంగమర్తికి చెందిన సబితా ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకపక్క ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటం.. తండ్రిని కోల్పోవటంతో.. కుటుంబ పోషణ బారమైంది. అటు చదువును కొనసాగిస్తూనే ఫ్యామిలీకి అండగా ఉండేందుకు..మొక్కవోని ధైర్యంతో ఆటో నేర్చుకుంది. ఆటో నడుపుతుండగా వచ్చిన డబ్బులతో కుటుంబానికి అండగా నిలుస్తోంది యువతి.

కుటుంబ పోషణకు యువతి ఆటో నడుపుతున్నతీరు మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. సబితా ధైర్యాన్ని మెచ్చిన మంత్రి కేటీఆర్‌...ఆమెకు అన్నివిధాలా అండగా ఉండేలా నల్గొండ కలెక్టర్‌ను ఆదేశించారు. ఎలాంటి జంకులేకుడా ఆటో నడిపిస్తుండటంపై కేటీఆర్ అభినందించారు. సబితాను స్వయంగా కలుసుకుంటానన్న కేటీఆర్‌...ఇచ్చినమాట మేరకు సబితను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. తండ్రిని కోల్పోయి కడుపేదరికంలో సబితాకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లుతోపాటు ఆటో కొనుగోలుకు సాయం అందించారు. భవిష్యత్తులు అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ అండగా నిలవడం పట్ల సబితా సంతోషం వ్యక్తం చేసింది. తన ఫ్యామిలీకి అందించిన సాయంను ఎన్నటికీ మరచిపోలేనన్న ఆమె.. కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని లక్ష్యాలు అధిగమిస్తానన్న విశ్వాసం వ్యక్తం చేసింది. అటు సబితా ప్రయత్నాలను స్థానికులు అభినందిస్తున్నారు. ధైర్యంగా ఆటోను నడుపుతుండటం నలుగురికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story