అప్ప‌ట్నుంచే టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం -కేటీఆర్

అప్ప‌ట్నుంచే టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం  -కేటీఆర్
KTR: సెప్టెంబర్ మాసంలో టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

KTR: సెప్టెంబర్ మాసంలో టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచి .. రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించుకోలేక పోయిన పార్టీ వార్షికోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఉద్యమ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా గొప్పవిషయం అన్నారు. అభివృద్దిలో తెలంగాణ ముందుందని, కేంద్ర గణాంకాలే స్పష్టం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలోని 17లక్షల దళిత కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకే దళిత బంధు పథకాన్ని తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం ఈ పథకాన్ని తేలేదని వెల్లడించారు. ఈ ఉప ఎన్నిక తమకో లెక్కకాదని.. ఇలాంటి ఎన్నికలు ఎన్నో చూశామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గడిచిన 75 ఏళ్లపాటు ప్రభుత్వం వాళ్లచేతుల్లోనే ఉందని.. కానీ విద్యుత్, మంచినీళ్లు ఇవ్వలేని దద్దమ్మలని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. అసమర్ధుల మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దమ్ముంటే వారి పాలనలలోఉన్న రాష్ట్రాల్లో దళిత బంధు తీసుకురావాలని మంత్రికేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story