KTR: రాజ్యాంగాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారు - కేటీఆర్‌

KTR (tv5news.in)

KTR (tv5news.in)

KTR: సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌ పలు గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు

KTR: అంబేద్కర్‌ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కేటీఆర్‌. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించి నివాళులర్పించారు. తంగళ్లపల్లిలో నిర్మించనున్న అంబేద్కర్‌ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆర్టికల్‌-3 వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు. ప్రపంచ మేధావి, దార్శనికుడు అంబేద్కర్‌ అని కొనియాడారు.

రాజ్యాంగాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారన్నారు మంత్రి కేటీఆర్‌. సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకొని కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. రాజ్యాంగం ఏ ఒక్క వర్గానిదో కాదు.. అందరిదని తెలిపారు. దేశంలో ఎక్కడైనా ఎస్సీలకు 10 లక్షలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దళితబంధు విజయవంతమైతే దేశానికి ఎజెండా సెట్‌ చేసిన వాళ్లమవుతామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story