KTR: దేశానికి వెన్నుముకలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: కేటీఆర్

KTR: దేశానికి వెన్నుముకలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: కేటీఆర్
KTR: తెలంగాణలో అప్పుచేసిన ప్రతి రూపాయి పెట్టుబడుల కోసమే ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR: తెలంగాణలో అప్పుచేసిన ప్రతి రూపాయి పెట్టుబడుల కోసమే ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి కేటీఆర్... రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సత్వర అనుమతులిచ్చేందుకు ప్రవేశపెట్టిన సింగిల్‌ విండో పద్దతికి మంచి స్పందన వస్తోందన్నారు.17 వేల 302 కొత్త పరిశ్రమలు అనుమతుల కోసం టీఎస్‌ ఐపాస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.13 వేలకు పైగా పరిశ్రమలు పర్మిషన్‌లతో కార్యకలపాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల గురించి కేంద్రం పొగడ్తలే కానీ పైస ఇవ్వటం లేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా నిధులు వెళ్తున్నా అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చేది తక్కువేనని ఆరోపించారు. దేశానికి వెన్నుముకలా నిలిచిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న విషయం కేంద్రం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story