KTR: బండి సంజయ్‌ పాదయాత్రపై కేటీఆర్ హాట్ కామెంట్స్.. దగాకోరు యాత్ర అంటూ..

KTR: బండి సంజయ్‌ పాదయాత్రపై కేటీఆర్ హాట్ కామెంట్స్.. దగాకోరు యాత్ర అంటూ..
KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.

KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు.. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్రేనన్నారు.. జూటాకోర్‌ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్రగా ఆయన అభివర్ణించారు.. పచ్చబడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు అక్కడ అడుగు పెట్టే హక్కు లేదంటూ బండి సంజయ్‌కి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్‌ నిప్పులు చెరిగారు..

కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జైకొడుతూ పాలమూరు రైతులకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా అంటూ ఫైరయ్యారు.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని లేఖలో ప్రశ్నించారు.. కర్నాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు..

అడుగడుగునా అన్యాయం.. తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్‌.. విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు, నీతి ఆయోగ్‌ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు.. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు.. ఉచిత కరెంటు ఇస్తుంటే మోటార్లకు మీటర్లు పెట్టమని బ్లాక్‌మెయిల్‌ చేస్తారంటూ లేఖలో ఘాటైన విమర్శలు చేశారు..

సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం కక్కుతారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డారు.. తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ అన్నారు. కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు.. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా అని నిలదీశారు కేటీఆర్‌.

రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మితడల దండులా యాత్రకు బయల్దేరుతారా అంటూ నిప్పులు చెరిగారు.. రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న బండి సంజయ్‌కి పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనే లేదన్నారు.. తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిదన్నారు.. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story