KTR: టెక్స్‌టైల్స్ పరిశ్రమలపై జీఎస్‌టీ పెంపు.. ఆ ఆలోచన విరమించుకోవాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ..

KTR (tv5news.in)

KTR (tv5news.in)

KTR: చేనేత, టెక్స్ టైల్స్ పరిశ్రమలపై GST పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

KTR: చేనేత, టెక్స్ టైల్స్ పరిశ్రమపై GST పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ఈమేరకు కేంద్రానికి లేఖ రాశారు. కరోనా సంక్షోభంలో చేనేత రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోందన్నారు కేటీఆర్. ఇలాంటి సమయంలో ఏకంగా 7శాతం GST పెంచితే చేనేత రంగం కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తుంది చేేనేతరంగమే అన్నారు కేటీఆర్. ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిపోయి పన్నులు పెంచడం ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు.

చరిత్రలో ఏనాడు కూడా చేనేతపై పన్ను లేదన్నారు కేటీఆర్. కేంద్రంలో BJP వచ్చాకే పన్నులు వేయడం మొదలుపెట్టిందన్నారు. GST ద్వారా మొదటిసారి 5శాతం పన్నువేసినప్పుడే.. చేనేతరంగం నుంచి తీవ్ర వ‌్యతిరేకత ఎదురైందన్నారు. తెలంగాణలో అద్భుతమైన చేనేత సంప్రదాయం ఉందన్నారు కేటీఆర్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందన్నారు. కేంద్రం నిర్ణయంతో నేతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story