వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు..!

వైభవంగా లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు..!
పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.

పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. వీఐపీలు, సామాన్యభక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించారు. అటు, బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్‌ కూడా ఏర్పాడటు చేశారు. 113వ వార్షిక ఉత్సవాల సందర్భగా పాతబస్తీలో ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది. బోనాల సందర్బంగా 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఓల్డ్‌సిటీలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఘట్టంలో.. ఇవాళ, రేపు కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఓల్డ్‌సిటీ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అంబారీ ఊరేగింపు, రంగానికి కూడా ఏర్పాట్లు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటూ తలసాని పట్టువస్త్రాలు సమర్పించారు. ఆషాఢబోనాల ఉత్సవాల్లో భాగంగా చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారికి, పాతబస్తీ హరి బౌలీలోని బంగారు మైసమ్మ అమ్మవారికి, శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయంలోను, ఉప్పుగూడలో మహంకాళి అమ్మవారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story