Telangana : మద్యం బాటిల్ పై పాత ధర ఉన్నప్పటికి కొత్త ధరలు వర్తిస్తాయి : అధికారులు

Telangana : మద్యం బాటిల్ పై పాత ధర ఉన్నప్పటికి కొత్త ధరలు వర్తిస్తాయి : అధికారులు
Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. మందుబాబులు షాకయ్యారు.

Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. మందుబాబులు షాకయ్యారు. కొత్త ధరల ప్రకారం ఒక్కో బీరుపై 10 రూపాయలు పెరగ్గా.. రెండువందల లోపు MRP ఉన్న లిక్కర్‌ బ్రాండ్లపై.. 180MLకు 20 రూపాయలు, 375MLకు 40 రూపాయలు, 750MLకు 80 రూపాయల లెక్కన పెంచారు. ఇక రెండు వందల కంటే ఎక్కువ MRP ఉన్న బ్రాండ్లపై 180MLకు 40 రూపాయలు.. 375MLకు 80 రూపాయలు, 750MLకు 160 రూపాయల చొప్పున పెంచారు. ఇక వైన్స్‌ బ్రాండ్‌ ఎమ్మార్పీపై క్వార్టర్‌, ఆఫ్‌, ఫుల్‌, బాటిళ్లపై 10, 20, 40 లెక్కన పెంచారు. నిల్వ ఉన్న మద్యానికి పాత ఎమ్మార్పీ ఉన్నప్పటికి కొత్త ధరలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనకు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు మద్యం ధరులు పెంచడంతో మందుబాబులు ఆవేదన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story