'ఈఎస్‌ఐ' మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం..

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం..

ఈఎస్ఐ డైర‌క్ట‌రేట్‌లో అవినీతి కుంభ‌కోణాలు అనేకం వెలుగు లోకి వ‌స్తున్నాయి.దీంట్లో వంద‌ల కోట్ల రూపాయ‌ల కార్మికుల సొమ్మును ఈఎస్ఐ ఉన్న‌తాధికారులు అప్ప‌నంగా కాజేశారు. ఉన్నతాధికారులు కొనుగోళ్లలో కనీస నిబంధనలకు తూట్లు పొడిచారు. తప్పనిసరిగా పాటించాల్సిన ఈ-టెండరు విధానానికి తిలోదకాలిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన బినామీ సంస్థలకు మందుల టెండర్లను కట్టబెట్టారు.అయితే విజిలెన్స్ విచార‌ణ‌లో అవినీతి జ‌రిగింది అని తేలిన‌...ప్ర‌భుత్వం ఏందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.నిధుల గోల్ మాల్ కు సంబందించి చ‌ర్య‌లు తీసుకోవండంలో విఫ‌లం అయ్యారని ప్ర‌జాసంఘాలు,వివిద పార్టీల నేత‌లు అంటున్నారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది.ఈఎస్ఐ అదికారులు ఎక్క‌డ కూడ నిబంద‌న‌లు పాటించ‌కుండా ఇష్టారాజ్యంగా మందుల కొనుగోళ్లు చేసిన‌ట్టు విజిలెన్స్ విచార‌ణ‌లో తెలింది.కార్మికుల నిధుల‌తో కార్మిల‌కు వైద్య సేవ‌లందించేందుకు ఈఎస్ఐ డైర‌క్ట‌రెట్ ప‌రిధిలో 77 డిస్పెన్స‌రీలు,4 సూప‌ర్ స్పెషాలిటీ హ‌స్పిట‌ల్స్,డ‌యాగ్న‌టిక్ సెంట‌ర్లు ఉన్నాయి.ఈ ఆసుప‌త్రుల‌కు అవ‌స‌రం అయిన మందులు,ప‌రిక‌రాలు కొనుగోలు చేసేందుకు ఎలాంటి అవ‌క‌త‌వ‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు 2012లో జీవో 51 తీసుకొచ్చారు.కానీ ఈఎస్ఐ అదికారులు ఈ జీవోను ప‌క్క‌న బెట్టి ఇష్టారాజ్యంగా మందుల‌ను,కిట్స్ ని కొనుగోలు చేశారు.ఇందులో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని 2019న విజిలేన్స్ శాఖ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింది.

ఔషధ నిల్వ కమిటీని ఏర్పాటుచేసి మందుల కొనుగోళ్లకు తప్పనిసరిగా ఆ కమిటీ ఆమోదం పొందాలి. అయితే 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలలో కమిటీలను ఏర్పాటు చేయలేదు.అంతే కాకుండా ఈ టెండ‌ర్ విధానాన్ని పాటించ‌కుండా వారికి ఇష్టం ఉన్న కంప‌నీల‌కు అప్ప‌జేప్పారు.ఔషధ కొనుగోళ్ల అక్రమాల్లో ఈఎస్‌ఐ డైరెక్టర్‌, ఇద్దరు జాయింట్ డైర‌క్ట‌ర్లు, ఇద్దరు ఫార్మాసిస్టుల పాత్ర ఉందని నిఘా నివేదిక వెల్లడించింది. వీరందరిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది.అయితే వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఎందుకు నిర‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జా సంఘాలు మండి ప‌డుతున్నాయి.

సాధారణంగా టెండరులో తక్కువ ధరను పొందుపర్చిన(ఎల్‌1) సంస్థకు ఔషధ సరఫరా బాధ్యతను అప్పగిస్తారు. ఒకవేళ ఆ సంస్థ మందులను సరఫరా చేయలేని పరిస్థితుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సంస్థలకు అవకాశమిస్తారు. అయితే ఇక్కడ అసలలాంటి ప్రయత్నమే జరగలేదు. మందులను సరఫరా చేయనందుకు ఎల్‌1 సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న సంస్థలతో సంప్రదించకుండా నేరుగా అత్యధిక ధరలతో మందులను కొన్నారు.

ముందే కుదుర్చుకున్న ధర ఒప్పంద విధానం ప్రాతిపదికనే మందులు కొనాలి. ఒకవేళ ధర ఒప్పందం విధానంలో లేని మందులను కొనాలంటే బహిరంగ టెండరు విధానాన్ని అనుసరించాలి. దీనికోసం ముగ్గురు సభ్యులతో స్థానిక కొనుగోలు కమిటీని ఏర్పాటుచేయాలి. ఆ కమిటీ మందుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తుంది. కానీ అలాంటిదేమీ లేకుండా ఇష్టారాజ్యంగా కొన్నారు.ఆన్‌లైన్‌లో టెండరు నిర్వహించకుండా గోప్యంగా తమకు నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టే విధంగా వ్యవహరించారు. మొత్తంగా ఔషధ కొనుగోళ్లలో పారదర్శకత లోపించింది.అధికారుల బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story