TRS Plenary 2021: ప్లీనరీలో వంటలే హైలైట్.. టీ నుండి ఐస్‌క్రీమ్ వరకు..

TRS Plenary 2021 (tv5news.in)

TRS Plenary 2021 (tv5news.in)

TRS Plenary 2021: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఈసారి అందరూ చర్చించుకుంటున్న అంశం.. భోజనం గురించే.

TRS Plenary 2021: టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఈసారి అందరూ చర్చించుకుంటున్న అంశం.. భోజనం గురించే. తెలంగాణ సంస్కృతిలో అతిథులకు ప్రత్యేక మర్యాదలు ఉంటాయి. ఆ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ప్రత్యేక మెనూ సిద్ధం చేసింది టీఆర్ఎస్‌. వెజ్‌, నాన్‌వెజ్‌ స్పెషల్స్‌తో ఘుమఘుమలాడించే వంటకాలను తయారుచేయిస్తోంది. తెలంగాణ రుచులే కాదు.. రాయలసీమ ప్రాంత ప్రజలు ఇష్టంగా ఆరగించే రాగి సంకటిని కూడా జోడించారు.

మొత్తంగా షడ్రుచోపేత వంటలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేసింది. గత ప్లీనరీలో టీ ఇవ్వలేదన్న మాట రావడంతో ఈసారి ప్రత్యేకంగా ఇరానీ ఛాయ్‌ని మెనూలో పెట్టారు. మొత్తంగా టీ నుంచి ఐస్‌క్రీమ్‌ వరకు ప్లీనరీకి వచ్చే వారి కోసం 34 రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ ప్లీనరీలో ఈ మాత్రం రుచులు లేకపోతే అస్సలు బాగోదనుకుంది టీఆర్‌ఎస్ అధిష్టానం.

అందుకే, నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌లో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఇక వెజ్‌ కోరుకునే వారికీ తక్కువేం చేయడం లేదు. నాన్‌ వెజ్‌ రుచులు 9 ఉంటే.. మిగతావన్నీ వెజిటేరియన్స్‌ కోసమే తయారు చేయిస్తున్నారు. ప్రత్యేకమైన చట్నీలు, మూడు రకాల స్పెషల్‌ స్వీట్లు, గత్తి వంకాయ కూర, జీడిపప్పు దట్టంగా జోడించిన బెండకాయ ఫ్రై.. ఇలా గుమ్మెత్తించే వంటలు వండిస్తున్నారు.

నాన్‌ వెజ్ ఐటమ్స్‌లో.. ధమ్ చికెన్ బిర్యాని, మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, ఎగ్ మసాలా, నల్లా పొడి ప్రై, మటన్ దాల్చా, బోటీ ఫ్రై, పాయా సూప్, తలకాయ పులుసు స్పెషల్‌గా చేయిస్తున్నారు. వెజ్‌ ఐటమ్స్‌లో రాగి సంకటిని ప్రత్యేక వంటకంగా చేర్చారు. దీంతో పాటు రుమాల్ రోటీ, ఆలూ క్యాప్సికం, బగారా రైస్, వెజ్ బిర్యాని, వైట్ రైస్, మిర్చి కా సలాన్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, ముద్దపప్పు, సాంబారు, ఉలవచారు + క్రీమ్, వంకాయ చట్నీ, బీరకాయ టమోటా చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల ఆవకాయ, పెరుగు, పెరుగు చట్నీ, వడియాలు చేయిస్తున్నారు.

స్వీట్స్‌లో భాగంగా జిలేబీ, డబుల్‌కా మీటాను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఫినిషింగ్‌ టచ్‌ కోసం ఐస్‌క్రీం కూడా ఇస్తారు. ఈ మెనూలో ఇరానీ టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారంటోంది టీఆర్‌ఎస్‌ పార్టీ. హైటెక్స్‌ ప్రాంగణంలోని 5 ప్రత్యేక షెడ్లలో ఒకేసారి 8 వేల మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story