తెలంగాణలో లాక్ డౌన్ ప్రసక్తిలేదు : మంత్రి ఈటెల

తెలంగాణలో లాక్ డౌన్ ప్రసక్తిలేదు : మంత్రి ఈటెల
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని.. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చూసించారు.

తెలంగాణాలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదన్నారు వైద్య,ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం మంత్రి... మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ మహరాష్ట్రలో వేగంగా వ్యాపిస్తోందని..ఇతర రాష్ట్రాల కరోనా బాధితులు వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారన్నారు. దీని కారణంగా తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు తగ్గించుకోవాలని.. అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని చూసించారు. మాస్కులు, శానిటేజర్లు ఉపయోగించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం తరుపున అన్నిచర్యలు తీసుకున్నామన్నారు మంత్రి ఈటల.

కేసులు సంఖ్య పెరిగినా.. వైరస్ తీవ్రత తగ్గిందన్నారు. కరోనా వైద్యం చేసే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు మానవతా దృక్పదంతో వ్యవహరించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యానికి ఇప్పటికే ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసిందన్నారు. కరోనా వైద్యంతోపాటు.. నాన్ కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ అందించాలని వైద్యాలయాల నిర్వాహకులకు సూచించారు. పేద ప్రజలు ఆస్పత్రికి వచ్చినప్పుడు వాళ్లను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టొద్దన్నారు.

Tags

Read MoreRead Less
Next Story