సిద్ధిపేటలో త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు..!

సిద్ధిపేటలో త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు..!
సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను స్థానిక పోలీసులు, నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు.

సిద్ధిపేట జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ త్రీ-టౌన్ పోలీస్‌ స్టేషన్‌ను స్థానిక పోలీసులు, నేతలతో కలిసి మంత్రి ప్రారంభించారు. పోలీస్ వ్యవస్ధలో గుణాత్మకమార్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు. అత్యధిక సీసీ కెమెరాలు వాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. సఖి సెంటర్, ఉమెన్స్ పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ వంటి కార్యాలయాలు ఒకే చోట ఉండేలా త్వరలో కొత్త భవనాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story