కరోనా కారణంగా ఆదాయం లేకపోవడంతో జీతాలు ఆలస్యం : హరీష్‌ రావు

కరోనా కారణంగా ఆదాయం లేకపోవడంతో జీతాలు ఆలస్యం : హరీష్‌ రావు
కరోనా కారణంగా ఆదాయం రాకపోవడంతో జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు..

కరోనా కారణంగా ఆదాయం రాకపోవడంతో జీతాలు ఆలస్యం అవుతున్నాయని ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.. రాబోయే రోజుల్లో మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లులేని అంగన్వాడీ టీచర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామన్నారు. హుజురాబాద్ పట్టణంలో టీఎన్జీవో అంగన్వాడీ టీచర్స్‌ అండ్ వెల్ఫర్స్ అసోసియేషన్ సభలో పాల్గొన్న మంత్రి.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయకుండానే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచామన్నారు. ఖాళీగా ఉన్న 450 పోస్టులను అంగన్వాడీ టీచర్లతో నాలుగు ఐదు రోజుల్లో ప్రమోషన్ కల్పిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story