పరిశ్రమలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు రావాలి : మంత్రి హరీష్‌రావు

పరిశ్రమలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు రావాలి : మంత్రి హరీష్‌రావు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. తోషిబా కంపెనీలో ఐటీఐ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. తోషిబా కంపెనీలో ఐటీఐ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. జపాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణా తరగతుల్లో సంగారెడ్డి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి హరీష్‌రావు.. ఐటీఐ విద్యార్థులను ప్రోత్సహించాలచి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story