KTR On Etela : ఈటెల.. జై శ్రీరామ్, జై మోదీ అని ఎందుకు అనడం లేదు : కేటీఆర్‌

KTR On Etela : ఈటెల..  జై శ్రీరామ్, జై మోదీ అని ఎందుకు అనడం లేదు : కేటీఆర్‌
KTR On Etela : హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్..

KTR On Etela : హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. ఈటెల రాజేందర్‌ను గెలిపించి కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందని.. అందుకే హుజురాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. హుజురాబాద్ ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్‌ను బీజేపీ మన అనుకోవడం లేదని... ఈటెల జై శ్రీరామ్, జై మోదీ అని ఎందుకు అనడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. రాజేందర్‌కు ఏం అన్యాయం జరిగిందో ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఈటెల గెలిస్తే ప్రజలకు వచ్చేదేంటన్నారు. దళిత బంధు 10 రోజులు మాత్రమే ఆగుతుందని కేటీఆర్ అన్నారు.

2018 శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, కోవిడ్ వల్ల కాస్త స్తబ్దత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. అందుకే ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో స్పీడ్‌ పెంచామన్నారు. కేసీఆర్ గారిని బలపరుస్తూ ఇప్పటి వరకు 10నామినేషన్లు వచ్చాయని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల సభ్యులంతా నవంబర్ 15న వరంగల్‌లో జరిగే సభకు హాజరవుతారని చెప్పారు. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకోసం ఆర్టీసీ బస్సులు వాడుకోబోతున్నామని KTR తెలిపారు. ఆ రోజు ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలగొచ్చని, అంతా అర్థం చేసుకోవాలని కోరారు.

20 ఏళ్ళ పార్టీగా తాము సాధించిన విజయాలు, రెండు దఫాలుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఆ సభావేదిక నుంచే కేసీఆర్ అన్నీ వివరిస్తారన్నారు. దేశానికి TRS ఎంత ఆదర్శంగా నిలిచిందనేది సభలో ప్రజలకు చెబుతామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పిన KTR.. కోవిడ్‌తో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు. మొదటి దఫా అధికారంలోకి వచ్చాక పరిపాలనపై పూర్తి దృష్టి పెట్టామని, ఇప్పుడు రెండవసారి అధికారంలోకి వచ్చాక పరిపాలనతో పాటు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలపై ఈటల రాజేందర్‌ విమర్శలు చేశారని KTR గుర్తు చేశారు. హుజురాబాద్‌లో తను గెలిస్తే ప్రజలకు ఏం జరుగుతుందో రాజేందర్‌ ఎందుకు చెప్పడం లేదన్నారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే దళితబంధు అమలైందని చెప్పారు. తాము అమలు చేస్తున్న వందల పథకాలు ఎవరు రాజీనామా చేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. రాజకీయాల్లో ఛాలెంజ్‌లకు అర్థం లేకుండా పోతుందని విమర్శించారు కేటీఆర్. హుజురాబాద్‌ కోసం కేంద్రం నుంచి ఏం తెస్తుందో బీజేపీ చెప్పాలని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story