KTR : రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్‌

KTR : రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్‌
KTR : కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఎవరో రాసిచ్చింది రాహుల్ గాంధీ చదివి వెళ్లారని విమర్శించారు.

KTR : కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఎవరో రాసిచ్చింది రాహుల్ గాంధీ చదివి వెళ్లారని విమర్శించారు. రాహుల్‌ గాంధీకి ఎడ్లు తెలువదు..వడ్లు తెలువదంటూ ఎద్దెవా చేశారు కేటీఆర్‌. తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని డిక్లరేషన్ తెలంగాణలో అమలు చేస్తారంటా అని కేటీఆర్ కామెంట్ చేశారు. ప్రజల దృష్టిని మరల్చడమే కాంగ్రెస్ ఎజెండా అన్నారు.

అంతకుముందు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలిలో కైటెక్స్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేశారు. 12 వేల కోట్లతో 187 ఎకరాల్లో కైటెక్స్ వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 8 వేల మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు. కైటెక్స్ పరిశ్రమకు చలివాగు నుంచి నీరందించేందుకు వంద కోట్లతో నిర్మించనున్న మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌కు, ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. గణేష్‌ ఎకొ పెట్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలోనూ మంత్రి పాల్గొన్నారు. కాకతీయ జౌళి పార్కులో 400 కోట్ల వ్యయంతో ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ ద్వారా 700 మందికి ఉపాధి లభించనుంది.

Tags

Read MoreRead Less
Next Story