పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌

పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్‌
KTR: అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది.

KTR- Anjali: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలికి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించారు. అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో... చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్‌ ను కోరింది.

అంజలి ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి రెండేళ్లుగా ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ ఏడాదితో పాటు... రానున్న సంవత్సరానికి గానూ ఐఐటీ ఫీజుల మొత్తాన్ని ఇవాళ కేటీఆర్‌... అంజలి కుటుంబానికి అందించారు. అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమె చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ తమ కూతురు ఐఐటి విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story