లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ : మంత్రి కేటీఆర్‌

లైఫ్ సైన్సెస్ క్యాపిట‌ల్ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ : మంత్రి కేటీఆర్‌
2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమ ఏర్పాటే తెలంగాణ లైఫ్ సైన్సెస్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు.

2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమ ఏర్పాటే తెలంగాణ లైఫ్ సైన్సెస్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కులోని 7 లైఫ్ సైన్సెస్‌ ఫ్యాక్టరీలను ఆయన ప్రారంభించారు. ఆవిష్యరణలు, పరిశోధనలు చేసే సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీల ద్వారా 265 కోట్ల పెట్టుబడిని, 13 వందల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. కంపెనీల ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్న కేటీఆర్.. మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story