పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్‌ఎస్ ధ్యేయం : కేటీఆర్‌

పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్‌ఎస్ ధ్యేయం : కేటీఆర్‌
తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, ప్రస్తుతం ఉచితంగా తాగునీటిని అందించే స్థాయికి చేరుకున్నామన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకాన్ని రెహమత్‌గనర్‌లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌ . ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్‌ .. రెండ్రోజల ముందే హైదరాబాద్‌కు సంక్రాంతి వచ్చిందన్నారు. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని, ప్రస్తుతం ఉచితంగా తాగునీటిని అందించే స్థాయికి చేరుకున్నామన్నారు.

కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే టీఆర్‌ఎస్ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, సీఎస్‌ సోమేష్‌కుమార్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మగాంటి గోపినాథ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.

ఉచిత తాగునీటి పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకపోయినా ఉచితంగా నీరు అందిస్తారు. మిగిలిన ఏరియాలు, అపార్ట్‌మెంటల్లో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన చేశారు. 20వేల లీటర్లు దాటితే పాత చార్జీలతో బిల్లు వసూలు చేయనుంది జలమండలి.

ఈ పథకం గ్రేటర్‌లో పది లక్షల 8వేల నల్లా కనెక్షన్లకు వర్తిస్తుంది. 97 శాతం మందికి లబ్ధి చేకూరుతుంది. జలమండలి దాదాపు 20 కోట్ల రూపాయలు నష్టపోనుంది. ఈ పథకం వర్తించాలంటే మార్చి31లోపు తప్పని సరిగా మీటర్లను ఏర్పాటు చేసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story