తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ : మంత్రి కేటీఆర్

తెలంగాణ భవన్ లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యే లతో మంత్రి కేటీఆర్ సమావేశం ముగిసింది. ఈ నెల 8న రైతుల బంద్ కు మద్దతుగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లి గల్లి బంద్ చేయాలని.. కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని బంద్ ను విజయవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాలన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఒడిపోయాం అని బాధపడొద్దని కేటీఆర్ హితబోధ చేశారు. గెలుపు ఓటములు సహజమని.. ఎప్పటిలాగానే నగరంలో అభివృద్ధి చేస్తూ ముందుకు పోదామన్నారు. ఎన్నికల్లో సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించాల్సి ఉండాల్సిందన్నారు. కొత్తగా టిక్కెట్లు ఇచ్చిన వాళ్లందరూ గెలిచారని.. ఇక్కడే మన లెక్క తప్పిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు.

జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు కేటీఆర్. కేంద్రం ఆ విషయంలో ముందుకు వెళ్తోందన్నారు.. మనం కూడా జమిలి ఎన్నికలకు సిద్దంగా ఉండాలన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలను అనుభమంతా మల్చుకుని లోపాలను సరిదిద్దుకోవాలని కేటీఆర్ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story