ఆరున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో లాభం జరిగిందా? నష్టం జరిగిందా? ప్రతి పౌరుడు ఆలోచించాలి : కేటీఆర్

ఆరున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో లాభం జరిగిందా? నష్టం జరిగిందా? ప్రతి పౌరుడు ఆలోచించాలి : కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వానికి ముందు హైదరాబాద్‌లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, ఆనాటి రోజులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.

ఆరున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనేది ప్రతి పౌరుడు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్‌. కేసీఆర్ ప్రభుత్వానికి ముందు హైదరాబాద్‌లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, ఆనాటి రోజులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. నాలుగు ఓట్లు కోసం, రెండు సీట్ల కోసం అబద్ధాలు చెప్పే ప్రభుత్వం తమది కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు ఉన్నా.. అల్టిమేట్ ప్రభుత్వం మాత్రం కేంద్రంలో ఉన్నదేనని, కరోనా కారణంగా హెలికాప్టర్ మనీ సర్క్యులేట్ చేయాలని కేంద్రాన్ని అడిగితే ఏ చర్యా తీసుకోలేదని విమర్శించారు. మున్సిపల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ టాక్స్‌పై ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story