ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌
తెలంగాణాలో ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ.. ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు.

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణాలో ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఖండిస్తూ.. ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. తమకు అలవాటైన అసత్యాలు, అబద్దాలతో ప్రజలను, యువతను విపక్షాలు గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీవిషయంలో కాంగ్రెస్, బీజేపీ అబద్దాలు చెపుతున్నాయన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను కేటార్ వెల్లడించారు. 2014 నుంచి 2020 సంవత్సరం వరకు ఒక లక్షా 32వేల 899 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆయా శాఖల్లో మరోసారి ధృవీకరించుకోవచ్చన్నారు. నిజాలను జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను అయోమయానికి గురి చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

తాము ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎండగట్టేలా తాము కల్పించిన ఉద్యోగాల సంఖ్యను బహిర్గతం చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో ఉద్యోగాల వివరాలను శాఖల వారిగా వెల్లడించారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30 వేల 594 ఉద్యోగాలు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు- 31వేల 972 పోస్టులు, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ట్సిట్యూట్ ద్వారా 3 వేల 623 ఉద్యోగాలు కల్పించినట్లు కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story