ఏం సహకారం చేశారని ఛార్జ్‌షీట్‌ వేస్తారు? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ఏం సహకారం చేశారని ఛార్జ్‌షీట్‌ వేస్తారు? : మంత్రి శ్రీనివాస్‌గౌడ్

కేంద్ర మంత్రుల భాష చూస్తే దేశాన్ని పాలించేది వీరేనా అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ప్రధాని, కేంద్రమంత్రులు తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకున్నారని, కానీ ఇప్పుడు సెంటిమెంట్‌తో బీజేపీ ఓట్లు రాబట్టాలనుకుంటోందంటూ విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఏం సహకారం చేసిందని ఛార్జ్‌షీట్‌ వేస్తారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క ప్రాజెక్టైనా ఇచ్చిందా? అని అడిగారు. కేంద్రానికి అనేక సార్లు తాము సహకరించామని, రాష్ట్రపతి ఎంపిక, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అంశాలపై మద్దతిచ్చామని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదన్నారు. ఫెడరల్‌ ప్రభుత్వం అంటే ఇదేనా? అని ప్రశ్నించారాయన. నల్లధనం తీసుకోస్తామని చెప్పిన కేంద్రం... ఒక్క పైనా కూడా తీసుకురాలేకపోయిందన్నారు శ్రీనివాస్‌గౌడ్‌.

Tags

Read MoreRead Less
Next Story