తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణమైంది: ఎమ్మెల్యే బాల్క సుమన్

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణమైంది: ఎమ్మెల్యే బాల్క సుమన్
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. రెండు పంటలకు నీళ్లు అందిస్తూ రైతులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణమైనట్టే భావిస్తున్నామని స్టేట్‌మెంట్ ఇచ్చారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. రెండు పంటలకు నీళ్లు అందిస్తూ రైతులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. నిధుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే ఎక్కువ బడ్జెట్‌ పెట్టి.. ఆ నిధులు తెలంగాణలోనే వాడుకుంటున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా ఓపెన్ కోటాలో భర్తీ ఉండేదని, ప్రభుత్వ ఉద్యోగాలు లోకల్‌ వాళ్లకే దక్కేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఇప్పటికే తెలంగాణలో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందన్న బాల్క సుమన్.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతుందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. జోనల్ వ్యవస్థ ఫైల్ రాష్ట్రపతి దగ్గర ఉండడం వల్ల ఇంతకాలం ఉద్యోగాల భర్తీ ఆలస్యం అయిందని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం కాబోతోందని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story