Vemulawada MLA : ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ

Vemulawada MLA : ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

Vemulawada MLA : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసిట్టు తెలిపారు. రమేష్ కౌంటర్‌పై వివరణకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరగా.... హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టంచేసింది. వివాదంపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ అంశంపై చెన్నమనేని రమేష్‌ హైకోర్టును ఆశ్రయించారు.

చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోనే ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి విచారణ సందర్భంగా... హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు విధించింది.

Tags

Read MoreRead Less
Next Story