తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అశావాహులను ఊరిస్తున్నాయి. ప్రముఖు రాజకీయ పార్టీల నేతలతో పాటు యువకులు, సంఘ సేవకులు పోటీ పడుతున్నారు.ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉండగా.. మిగతా పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అంశమని మిగతా వారు భావిస్తుంటే.. ఎంత ఎక్కువ మంది పోటిలో ఉంటే తమకు అంత కలిసి వస్తుందని గులాబీ దళం అంచనా వేస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. రంగారెడ్డి,మహాబూబ్ నగర్,హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే గులాబీ దళంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో బొంతు రామ్మోహన్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, నాగేందర్ గౌడ్, కాసాని వీరేశ్ రేస్ లో ఉండగా.. ఇక కాంగ్రెసు నుండి పోటీకి చాలా మంది ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ చంద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి లు కూడ తమకు టిక్కెట్ కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఇక బిజెపి నుంచి సిటింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు వినిపిస్తుంది.ఇక వామపక్షాల మద్దతుతో ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉంటారని తెలుస్తుంది. ఇదే సెగ్మెంట్ నుండి ప్రైవేట్ జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షులు గౌరి సతీశ్ బరిలో ఉండగా.. ఇప్పటికే వీరంతా కొత్త ఓటర్లను నమోదు చేసే పనిలో ఉన్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరితో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ రామచందర్ రావు పదవి కాలం ముగుస్తుంది.ఇక 2017 ముందు డిగ్రీ పూర్తి చేసుకున్న వారు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది..ప్రధానంగా కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లపై అధికార పార్టీ ఎక్కువగా అశలు పెట్టుకుంది. ఇక రాజకీయ పార్టీల నేతలే కాకుండా ప్రజా సంఘాల నేతలు,యువజన సంఘాల నేతలు పోటీకి సై అంటున్నారు.

గత ఎన్నికల్లో కలిసి రాని సీట్ ను ఎలాగైన దక్కించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించే గొంతును చట్ట సభల్లోకి పంపాలని మిగతా పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఉన్న స్థానం దక్కించుకునేందుకు కమలదళం కసరత్తు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story