హైదరాబాద్‌ జలమండలి వాటర్ ట్యాంక్‌ల ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌ జలమండలి వాటర్ ట్యాంక్‌ల ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌ జలమండలి వాటర్ ట్యాంక్‌ల ప్రారంభోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 12.30కి ప్రారంభం అని చెప్పి ఉదయం 11.30కే ప్రారంభించారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. ట్యాంక్‌లకు కట్టిన ఫ్లెక్సీలను తొలగించి నిరసన తెలిపారు. ఇదే అంశంపై ప్రశ్నించినా మంత్రి మల్లారెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ సహా నేతలంతా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. వారందరినీ అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

ఎల్బీనగర్ పరిధిలోని వాసవినగర్‌లో జంట రిజర్వాయర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వాయర్లను ఇవాళ మంత్రి KTR ప్రారంభించారు. ఐతే.. ప్రారంభోత్సవ సమయం పన్నెండున్నర అని చెప్పి ముందే ఆ కార్యక్రమం ముగించడం ఏంటని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఫ్లెక్సీలను కూడా చింపేసి ఆందోళనకు దిగారు.


Tags

Read MoreRead Less
Next Story