ఫేస్‌బుక్ చాటింగ్.. ఇద్దరు పిల్లలున్న వ్యక్తి ఓ యువతితో..

ఫేస్‌బుక్ చాటింగ్.. ఇద్దరు పిల్లలున్న వ్యక్తి ఓ యువతితో..
తల్లిదండ్రులు చనిపోయాక.. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ... ప్రజ్ఞ జీవనం సాగిస్తోంది.

తల్లిదండ్రులు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న యువతిని.. ఓ కామాంధుడు వేధిస్తున్న ఘటన.. సూర్యాపేట పట్టణంలో జరిగింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించినప్పటికీ... రేవంత్ ఇజ్రాయెల్‌ అనే వ్యక్తి ఇంకా ఎక్కువ టార్చర్ పెడుతున్నాడని... మండారి ప్రజ్ఞ అనే యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

తల్లిదండ్రులు చనిపోయాక.. ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ... ప్రజ్ఞ జీవనం సాగిస్తోంది. మానసిక ప్రశాంతం కోసం అప్పుడప్పుడు స్థానిక చర్చికి వెళ్లేది. ఈక్రమంలో పెళ్లై ఇద్దరు పిల్లలున్న రేవంత్ ఇజ్రాయెల్ అనే వ్యక్తి... ఫేస్‌ బుక్‌ ద్వారా ప్రజ్ఞకు దగ్గరయ్యాడు. ప్రతిరోజు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తూ... వేధించడం సాగాడు. తనతో మర్యాదగా ప్రవర్తించాలని ప్రజ్ఞ హెచ్చరించడంతో... నోటికొచ్చిన బూతులు తిట్టేవాడని ప్రజ్ఞ అంటోంది.

రేవంత్ ఇజ్రాయెల్‌ వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కూడా.. రెండు రోజులు ఇజ్రాయెల్‌ను... స్టేషన్‌కు పిలిచి వదిలేశారని.. ఆ తర్వాత టార్చర్‌ మరింత ఎక్కువైందని.. ప్రజ్ఞ అంటోంది. పోలీసుల సహకారం లేకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని.. ప్రజ్ఞ భయపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story