Omicron: ఒమిక్రాన్‌ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేవు :హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు

Omicron: ఒమిక్రాన్‌ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు లేవు :హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు
Omicron: కరోనా థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు.

Omicron: కరోనా థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు. ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్‌ రూపంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు . ఒమిక్రాన్‌ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడంలేదన్నారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధా చేయోద్దన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు శ్రీనివాస్‌రావు.

వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకమన్నారు శ్రీనివాస్‌రావు. అర్హూలైన అందరూ సెకండ్‌ డోస్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు.ఈనేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ విధిగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు శ్రీనివాస్‌రావు.

Tags

Read MoreRead Less
Next Story