57ఏళ్లకే వృద్ధాప్య పింఛను.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!

57ఏళ్లకే వృద్ధాప్య పింఛను.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
వృద్ధాప్య పింఛను వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వృద్ధాప్య పింఛను వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో వృద్ధాప్య పింఛను వయోపరిమి తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు రానున్నాయి. దీనితో రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకోనుంది. ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్‌ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story