కరోనా వేళ.. పిల్లల్ని బడికి పంపించాలంటే ఈ రూల్స్..

కరోనా వేళ.. పిల్లల్ని బడికి పంపించాలంటే ఈ రూల్స్..
అందుకు అనుగుణంగా కొన్ని కఠినమైన రూల్స్ మధ్య ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులే.. కనీసం ఓ రెండు నెలలైనా ప్రత్యక్షంగా చదువు చెబితే పిల్లల రిజల్ట్ బావుంటుందేమో అని పాఠశాల యాజమాన్యం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా కొన్ని కఠినమైన రూల్స్ మధ్య ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 9,10, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ తెరవాలని నిర్ణయించింది. విద్యాసంస్థల ప్రారంభానికి విద్యాశాఖ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది.

ఈ నెల 20లోగా ప్రతి స్కూలు, కాలేజీని శుభ్రపరిచి శానిటేషన్ చేయించాలి.

స్కూల్స్, కాలేజీలు ప్రతి రోజు శానిటేషన్ చేయాలి. టాయులెట్లు, వాటర్ ట్యాంక్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాంతాలు కచ్చితంగా శానిటేషన్ చేయాలి.

స్కూల్ ఫర్నిచర్‌ని, స్టేషనరీ, స్టోరేజ్ ప్రాంతాలను, కిచెన్‌లను, ల్యాబ్‌లను శుభ్రపరచాలి.

వైద్య శాఖ సూచించిన మేరకు ప్రతి విద్యార్థి ఆరు ఫీట్ల దూరంలో కూర్చునే విధంగా మార్కింగ్ చేయాలి.

తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న విద్యార్థులను మాత్రమే క్లాసులకు అనుమతించాలి.

పరీక్షలు రాసే వారికి హాజరు శాతం కచ్చితంగా ఉండాలని నిబంధన పెట్టకూడదు.

పాఠశాలలో, కాలేజీలో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు.

ఇంతకు ముందున్న స్కూలు టైమింగ్సే పాటించాలి.

విద్యార్ధులతో పాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

విద్యార్ధులకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఉండే పాఠశాలకు అనుమతించకూడదు.

మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంచాలి.

తరగతి గదిలో 20 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

Tags

Read MoreRead Less
Next Story