Singareni: సింగరేణిలో మరణించిన కార్మికుల కుటుంబానికి ఆసరా.. 70 లక్షల నుండి కోటి వరకు..

Singareni (tv5news.in)

Singareni (tv5news.in)

Singareni: బొగ్గుగని ప్రమాదం విషాధాన్ని నింపింది. ఎస్సార్పీ-3 బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయారు.

Singareni: మంచిర్యాల జిల్లాలో బొగ్గుగని ప్రమాదం విషాధాన్ని నింపింది. ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయారు. మొదటి షిఫ్ట్‌లో డీప్-21, లెవల్-24 లెవల్ వద్ద కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా పైకప్పు కూలింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌.. శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సత్యనారాయణ, చంద్రశేఖర్‌ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తమ వారు మృతి చెందడటంతో.. కన్నీరుమున్నీరుగా విపలిస్తున్నారు కుటుంబసభ్యులు.

మరోవైపు.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు సింగరేణి ఉన్నతాధికారులు. సంస్థ తరుపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబసభ్యులను అందజేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితరలు కలిపి దాదాపు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు అందజేస్తామని వెల్లడించారు.

కార్మికుల మృతి పట్ల.. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ తదితరులు తీవ్ర సంతాపం తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపిన బాధ్యలుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌.

Tags

Read MoreRead Less
Next Story