పెట్రోల్ బంక్‌లో కల్తీ.. ఎలా చేస్తున్నారంటే..

పెట్రోల్ బంక్‌లో కల్తీ.. ఎలా చేస్తున్నారంటే..

అంతా కల్తీమయం అయిపోయింది.. చివరకు పెట్రోల్‌ కూడా కల్తీ చేసి జనాన్ని దోచుకుంటున్నారు కల్తీ రాయుళ్లు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్‌ దందా వెలుగు చూసింది.. పెట్రోల్‌లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు.. ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అందోల్ మైసమ్మ టెంపుల్ సమీపంలో హెచ్ పీ పెట్రోల్ బంక్‌ నిత్యం వాహనదారులతో కిటకిటలాడుతుంది.. అయితే, వెహికల్‌లో పెట్రోల్‌ పోయించుకుంటున్న వాహనదారులు అది అసలో నకిలీనో తెలుసుకోలేకపోతున్నారు.. దీంతో బంకు నిర్వాహకులు మరింతగా రెచ్చపోతున్నారు.

వాహనాల్లో సమస్యలు రావడంతో అసలు విషయాన్ని గుర్తించారు కొంతమంది. పెట్రోల్‌ బంకులో జరుగుతున్న దందాను తెలుసుకునేందుకు బాటిల్‌ పట్టుకెళ్లారు.. బాటిల్‌లో పెట్రోల్‌ నింపేది లేదంటూ బంకు నిర్వాహకులు చెప్పడంతో వాగ్వాదానికి దిగారు.. చివరకు బాటిల్‌లో పెట్రోల్‌ నింపారు.. దీంతో వారి బండారమంతా బయటపడింది.. లీటర్‌ బాటిల్‌లో సగం నీళ్లే కనిపించాయి.. దీనిని చూసి వాహనదారులు షాకయ్యారు.. ఇప్పటి వరకు చిప్‌లు పెట్టి మోసాలు చేయడాన్నే చూసిన జనం.. ఇలా సగం నీళ్లు, సగం పెట్రోల్‌తో దందాలు నడపడంపై మండిపడుతున్నారు.. పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story