Prashant Kishor: తెలంగాణలో రాజకీయ వ్యూహంపై కేసీఆర్‌తో పీకే రెండోరోజు చర్చలు..

Prashant Kishor: తెలంగాణలో రాజకీయ వ్యూహంపై కేసీఆర్‌తో పీకే రెండోరోజు చర్చలు..
Prashant Kishor: తెలంగాణలో రాజకీయ వ్యూహంపై సీఎం కేసీఆర్‌తో PK సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి.

Prashant Kishor: తెలంగాణలో రాజకీయ వ్యూహంపై సీఎం కేసీఆర్‌తో PK సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రగతిభవన్‌లో రోజంతా సాగిన సమావేశం ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్ట్‌లపైనా చర్చిస్తున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం TRSతో కలిసి పని చేసేందుకు, ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లేందుకు PK ఓకే చెప్పారు.

అటు చూస్తే ఢిల్లీలో సోనియాతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌.. ఆ చర్చల విషయాన్ని కేసీఆర్ వద్ద ప్రస్తావించారా..? PK కాంగ్రెస్‌లో చేరడం ఖాయమంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఒక పార్టీలో చేరబోతూ.. ప్రత్యర్థి పార్టీకి వ్యూహకర్తగా సేవలు సాధ్యమా..? ఇలాంటి పరిణామాలన్నీ ఇప్పుడు హాట్‌ టాపిక్ అయ్యాయి. TRSతో ఒప్పందం మేరకు తన బృందంతో కలిసి తెలంగాణలో రాజకీయమైన, పాలనాపరమైన పరిస్థితులపై సర్వే నిర్వహించారు పీకే.

మొదట 30 నియోజకవర్గాల్లో సర్వే ఫలితాలను అందించారు. ఆ తర్వాత మరో 89 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను పీకే కేసీఆర్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన సమావేశం అంశాలు కూడా నిన్నటి మీటింగ్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తానూ TRSతో కలిసి పని చేస్తానని పీకే వెల్లడించినట్లు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story