Rajasingh : దేవిశ్రీ కామెంట్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

Rajasingh :  దేవిశ్రీ కామెంట్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి : ఎమ్మెల్యే  రాజాసింగ్
Rajasingh : ప్రస్తుతం పుష్ప హవా నడుస్తోంది.. సుకుమార్ డైరెక్షన్ లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజై వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది.

Rajasingh : ప్రస్తుతం పుష్ప హవా నడుస్తోంది.. సుకుమార్ డైరెక్షన్ లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజై వసూళ్ళ పరంగా దూసుకుపోతోంది. ఇక సినిమాకి ముందే రిలీజైన పాటలు సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సమంత చేసిన ఐటెం సాంగ్ సినిమా క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది. క్రేజ్ తో పాటుగా కాస్త వివాదం కూడా చోటుచేసుకుంది.

ఊ.. అంటావా మామా అంటూ సాగే ఈ సాంగ్ పురుషులను కించపరిచేలా ఉందంటూ ఏపీలో పురుష సంఘం కేసు వేసింది. ఈ వివాదం మరువక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తనకు ఐటం సాంగ్ అయినా డివోషనల్ సాంగ్స్ అయినా ఒకటేనని షాకింగ్ కామెంట్స్ చేశారు. మీకు మాత్రమే ఐటెం సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ వేరు వేరని.. నాకు మాత్రం రెండూ ఒకటేనని అన్నారు. అంతే కాకుండా ఆర్య2లోని రింగ రింగ ఐటెం సాంగ్ ని డివోషనల్ గా పాడి వినిపించారు.

అయితే దేవిశ్రీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవిశ్రీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటుగా స్పందించారు. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కు.... హిందువుల పూజ సాంగ్ కు పెద్ద తేడా లేదని దేవిశ్రీ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవిశ్రీ కామెంట్లు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మర్యాదగా హిందువులకు క్షమాపణలు చెప్పకుంటే... తెలంగాణలో దేవిశ్రీని అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story