ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా
కొన్ని బస్సులకు ఫైర్‌ సేఫ్టీ రెన్యూవల్‌ చేసుకోలేదని గుర్తించారు. ప్రయాణికులతో పాటు లగేజీని కూడా రవాణా చేస్తున్న బస్సులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాలకు పెద్దఎత్తున బస్సులు వెళ్తున్నందున స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎల్బీనగర్‌లో 3 బస్సుల్ని సీజ్‌ చేసిన అధికారులు... ఆరు బస్సులపై కేసు నమోదు చేశారు. పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద 15 బస్సుల్ని సీజ్‌ చేశారు.

కొన్ని బస్సులకు ఫైర్‌ సేఫ్టీ రెన్యూవల్‌ చేసుకోలేదని గుర్తించారు. ప్రయాణికులతో పాటు లగేజీని కూడా రవాణా చేస్తున్న బస్సులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.సంక్రాంతి సందర్భంగా ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి వద్ద బెంగళూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

నిబంధనలు ఉల్లంఘించిన 15 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులపై కేసు నమోదు చేశారు. పండుగ సందర్భంగా బస్సులు అధిక సంఖ్యలో నడుస్తున్నందున... అధికారులు 50 సిబ్బందితో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story