కాంగ్రెస్‌కు సవాల్‌గా మారిన సాగర్ ఉపఎన్నిక

కాంగ్రెస్‌కు సవాల్‌గా మారిన సాగర్ ఉపఎన్నిక
పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపుతో ఉపుమీద ఉన్న టీఆర్ఎస్ ను .. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికలతో దూకుడు మీద ఉన్న బీజెపి లను నిలవరించడం హస్తానికి కత్తిమీద సాము గా తయారయ్యింది.

వరుస ఓటములతో సతమమౌతున్న కాంగ్రెస్ కు... నాగార్జున సాగర్ ఉపఎన్నిక సవాలుగా మారింది. పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపుతో ఉపుమీద ఉన్న టీఆర్ఎస్ ను .. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికలతో దూకుడు మీద ఉన్న బీజెపి లను నిలవరించడం హస్తానికి కత్తిమీద సాము గా తయారయ్యింది. అన్ని ఎన్నికల్లో ఓటములతో కాంగ్రెస్‌ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది. జీహెచ్ఎంసి ఎన్నికలో కేవలం రెండంటే రెండే స్థానాల్లో గెలిచింది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయింది.

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ లో గెలవడం కాంగ్రెస్ కు అనివార్యమైన పరిస్థితి . గతంలో దుబ్బాక ఉపఎన్నికలో అందరూ నాయకులు కలిసికట్టుగా పని చేశారు. విభేదాలు పక్కన పెట్టీ మరి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చేమటోర్చారు. ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ దగ్గరుండి మానిటరింగ్ చేశారు. కానీ నాగార్జున సాగర్ కు వచ్చేసరికి సీన్ అంతా మారింది. ఈ ఎన్నికలో జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్లు ఎవరూ..... ప్రచారం చేయడం లేదు. పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఉపఎన్నికలో సీనియర్ నాయకులుగా చెప్పుకునే వారు జానారెడ్డి గెలుపు కోసం పనిచేయాలి. కానీ వీరంతా అంటి ముట్టనట్లు గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. గెలిచే హోప్ కూడా లేని దుబ్బాక లో సీరియస్ గా దృష్టి పెట్టిన ఢిల్లీ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు .. ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్న సాగర్ ను మాత్రం పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

జానారెడ్డి ఇప్పటి వరకు రెండు మూడు సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఆయా మండలాల్లో గ్రామాలకు వెళ్లడం .. ముఖ్యుల్ని పిలిచి మాట్లాడటం చేశారు. కానీ ఎన్నికల బూత్ కు వెళ్ళే వరకు ఓటర్లను జానారెడ్డి ఇమేజ్ ఏమేరకు పనిచేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఎవరు ఎన్ని రకాల ప్రచారం నిర్వహించినా .. పోల్ మేనేజ్ మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ.. ఆ విషయంలో.... కాంగ్రెస్‌ సీనియర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి 7 సార్లు గెలిచారు. ఇక్కడ ఆయనకు గట్టి పట్టుంది. గ్రామాల్లోనూ అనేక మందిని పేరు పెట్టి పిలిచే నాయకుడు. ఆయనకు ఉన్న ఈ ఇమేజే గెలుపు కు దోహద పడుతుందనే ధీమా హస్తం నేతల్లో ఉంది. మరి ఆ ఇమేజ్ జానారెడ్డి ని ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story