కాసేపట్లో శంషాబాద్‌కు వస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌!

కాసేపట్లో శంషాబాద్‌కు వస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌!
పుణె సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుంది.

పుణె సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి 11 గంటల 30 నిమిషాలకు కార్గోకు చేరుకోనుంది. 11 గంటల 45 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో కోఠిలోని ఆసుపత్రికి తరలిస్తారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్పైస్ జెట్‌ కార్గో SG 7466 విమానంలో వ్యాక్సిన్ లోడ్‌ వస్తోంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కోఠి ఆసుపత్రిలో లోని కోల్డ్ స్టోరోజ్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లాలకు వ్యాక్సిన్‌ తరలిస్తారు. ఇప్పటికే జిల్లాలకు వ్యాక్సిన్ సిరంజిలు చేరుకున్నాయి. తెలంగాణకు 31 బాక్సుల్లో 3 లక్షల 72 వేల డోసుల వ్యాక్సిన్‌లు వస్తున్నాయి. ఈ నెల 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో తొలిరోజు.. 139 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ను.. హెల్త్ స్టాఫ్‌, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇస్తారు.

శంషాబాద్‌లో వ్యాక్సిన్‌ను చేర్చిన తర్వాత అదే కార్గో విమానం ఏపీలోని విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుంది. 4 లక్షల 70 వేల డోసులు ఏపీకి తరలిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కట్టుదిట్టమైన భద్రతతో కోల్డ్‌ స్టోరేజ్‌కు అధికారులు తరలిస్తారు. అక్కడి నుంచి 19 ప్రత్యేక వాహనాల్లో రేపు అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు వ్యాక్సిన్‌ తరలిస్తారు.

2 నుంచి 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే వ్యాక్సిన్ డెలివరీ వాహనాల్లో ఏర్పాట్లు చేశారు. గన్నవరంలోని రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో రెండు పెద్ద వాక్ ఇన్‌ కూలర్స్‌ నెలకొల్పారు. వీటిలో ఒక్కోటి 40 క్యూబిక్ మీటర్లు, 20 క్యూబిక్ మీటర్ల కెపాసిటీతో ఉన్నాయి. వ్యాక్సిన్ భద్రపరిచేందుకు వీలుగా గన్నవరం కోల్డ్ స్టోరేజ్‌కు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులను లోపలికి అనుమతించడంలేదు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story