శభాష్ : ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన ఎస్సై!

శభాష్ : ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన ఎస్సై!
గత ఏడాది వర్షాల కారణంగా రెబ్బన మండలం ఖైర్గాంలో రమేష్ చారి అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయింది. దీనితో ఆ కుటుంబం రోడ్డు పైన పడింది.

ఖాకీలలో కూడా మంచి మానవత్వం ఉన్న మనుషులున్నారని నిరూపిస్తున్నారు కొందరు పోలీసులు... గత ఏడాది వర్షాల కారణంగా రెబ్బన మండలం ఖైర్గాంలో రమేష్ చారి అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయింది. దీనితో ఆ కుటుంబం రోడ్డు పైన పడింది. అయితే ఈ విషయం పేపర్ ద్వారా తెలుసుకున్న ఎస్సై రమేష్ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మూడు లక్షలు ఖర్చు పెట్టి రమేష్ చారి కుటుంబానికి ఇల్లు కట్టించి ఎంతో ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో నెటిజన్లు ఎస్సై రమేష్ ను అభినందిస్తున్నారు. గతంలోనూ రమేష్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. దహెగాం గ్రామంలో సొంత డబ్బులతో రోడ్డు వేయడం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా ఓ ఇద్దరు చిన్నారులకి ట్రీట్ మెంట్ కోసం సాయం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story