అభిమానం.. అబ్బాయికి 'సోనూసూద్' అని పేరు..

అభిమానం.. అబ్బాయికి సోనూసూద్ అని పేరు..
మంగళవారం రోజు తమ ఇంటిలో పూజ చేసి బాబుకు అన్నప్రాసన చేశారు. ఆరోజే ఆ చిన్నారికి సోనూసూద్ అని నామకరణం చేశారు.

తాత వారసత్వాన్ని మనవళ్లు కొనసాగించాలని ఆయన పేరు పెట్టుకుంటారు. కానీ ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న పేరు, ఆపత్కాలంలో ఆదుకుంటున్న వ్యక్తి, ఆయన పేరు కంటే గొప్ప పేరు మరేం వుంటుందని ఓ జంట తమ బిడ్డకు సోనూసూద్ అని పెట్టుకుని మురిసిపోతున్నారు. తమ బిడ్డ కూడా అంతటి వాడవ్వాలని, అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే మంచి గుణం సంపాదించాలని బాలీవుడ్ నటుడి పేరు పెట్టుకుని, ఆయన పట్ల తమకున్న కృతజ్ఞతను తెలుపుకున్నారు.

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన నవీన్, త్రివేణి దంపతులకు ఆరు నెలల క్రితం కుమారుడు పుట్టాడు. మంగళవారం రోజు తమ ఇంటిలో పూజ చేసి బాబుకు అన్నప్రాసన చేశారు. ఆరోజే ఆ చిన్నారికి సోనూసూద్ అని నామకరణం చేశారు. నవీన్ ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. తమ కుమారుడు కూడా నిజ జీవితంలో హీరో లక్షణాలను పెంపొందించుకుని సోనూసూద్‌లా ఎదగాలని కోరుకున్నారు.

రీల్ లైఫ్‌లో నెగెటివ్ పాత్రలకు పెట్టింది పేరు. కానీ రియల్ లైప్‌లో మంచి మనసున్న మారాజు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఒంటరిగా వున్న వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చడంలో ఆయన దాతృత్వసేవలు మొదలయ్యాయి. లాక్‌డౌన తర్వాత కూడా ఆయన తన సామాజిక సేవలను కొనసాగిస్తున్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ స్పందిస్తున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆనందంగా సాగిన అన్నప్రాసన కార్యక్రమంలో తమ కుమారుడికి సోనూసూద్ అని పేరు పెట్టారు.

తీవ్ర సంక్షోభం మధ్య, ఢిల్లీతో పాటు దేశంలోని వేలాది మంది వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం మరియు రవాణాను అందించడం ద్వారా వారు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఆయన సకాలంలో సహాయం అందించారని నవీన్ పేర్కొన్నారు.

"నా కొడుకు గత సంవత్సరం లాక్డౌన్ కాలంలో జన్మించాడు. గొప్ప మానవతావాది గౌరవార్థం సోను సూద్ పేరు పెట్టడం సముచితమని మేము భావించాము" అని ఆయన అన్నారు. తమ బిడ్డకు సహాయం చేసే సద్గుణాలను నేర్పిస్తామని ఆయన అన్నారు. అప్పుడు అతడు సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఎదుగుతాడని అన్నారు.

"మా కొడుకును ఆశీర్వదించమంటూ సోనూసూద్ సార్‌కి ట్విట్టర్లో ఒక సందేశాన్ని పంపాము" అని నవీన్ ఆనందంగా చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్, పోస్ట్-లాక్డౌన్ సమయంలో ఆయన చేసిన అసమాన్యమైన సేవలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని ఒక పేద రైతుకు సోన సూద్ ఒక ట్రాక్టర్‌ను బహుమతిగా ఇచ్చారు.

"అతడి సాటిలేని ఔదార్యం వలన ఆయనను రియల్ హీరోగా మేము గౌరవిస్తున్నాము. మా బిడ్డని కూడా అంతటి వాడిని చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము" అని నవీన్ భార్య త్రివేణి సంతోషంగా చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story